సిగ్గు ! సిగ్గు !!!

దేశానికి వెన్నుముక అయినా రైతుల కష్టాలను పట్టించుకొనే నాధుడే లేకుండా పోయాడు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఫలితం మాత్రం సూన్యం. సరైన సమయంలో వర్షాలు పడక పంటలు పండక, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర కరువు పరిస్థితులు, రుణభారం, ఇతరత్రా కారణాలతో రైతులు వేలాదిగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌ చేసినవ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్రం..మూడేండ్ల నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాల సమాచారమే లేదని నిసిగ్గుగా ప్రకటించింది. ఆత్మహత్యల వివరాల కోసం.. ఆత్మహత్యలకు సంబంధించిన రికార్డులను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మందసోర్‌లో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులను పోలీసులు కాల్చిచంపిన ఘటనలు కండ్లముందే కనిపిస్తున్నా.. తమ సమస్యలు తీర్చాలని రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టినా పట్టించుకోని బీజేపీ సర్కారు మాత్రం ఆత్మహత్యల సమాచారం లేదనిచెప్పడం గమనార్హం.

leave a reply