కబడ్డీకి అనూప్.. వీడ్కోలు!

కబ్బడ్డీ  అంటే ఒకప్పుడు పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు కానీ , ప్రో కబ్బడ్డీ వచ్చిన తరువాత లెక్కలు అన్ని మారిపోయాయి. అంతగా అందరిని ఆకట్టుకుంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా  అందరిని ఆకట్టుకుంది. ప్లేయర్స్ ఎక్కువ అయ్యారు అలాగే టీమ్స్ కూడా ఎక్కువ అయ్యాయి. భారత కబడ్డీ జట్టులో కెప్టెన్ గావ్యవహరించిన కబడ్డీ దిగ్గజం అనూప్ కుమార్ జైపూర్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే …. అనూప్ కుమార్ బుధవారం తన రిటైర్ మెంట్ ప్రకటించాడు. అనూప్ మాట్లాడుతూ … సరదా కోసం ఎంచుకున్న కబడ్డీ తనకి జీవితంలో ప్రధానమైంది అని చెప్పుకొచ్చారు.  దేశానికి ఆడటం తనకి గర్వంగా ఉందని చెప్పారు. అనూప్ కెప్టెన్సీలో  భారత్ 2010 మరియు 2014 ఆసియా క్రీడలలో స్వర్ణ పథకాలు సాధించడమే కాక 2016 ప్రపంచకప్ గెలిచింది. అయితే… తన వీడ్కోలు గుర్తుండిపోయేలా తన కుమారుని 10వ పుట్టినరోజున ఈ నిర్ణయాన్ని ప్రకటించానన్నాడు.

leave a reply