ఐపీఎల్‌లో వాటాలపై…అమితాబ్ క్లారిటీ!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్టులో వాటాలు కొనబోతున్నట్లు కొంతకాలంగా  వెలువడుతున్న వార్తలపై అయన స్వయంగా స్పందించారు. ఐపీఎల్‌జట్టులో వాటా కొనడం అవాస్తవమని.. అంతేకాకుండా తనకే కాదు, తన కుటుంబీకులకు కూడా ఎటుంవంటి ఆసక్తి లేదని స్పష్టం చేసారు. అయితే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జాతులకు సంబంధించిన సగం వాటాలు  విక్రయించేందుకు ఆయా జట్టు యజమానులు గతంలో ప్రకటించగా, ప్రస్తుతం వాటాలను కొనుగోలు చేసేందుకు అమితాబ్ కుటుంబీకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసిందే.

ఇంతకముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు వాటాలుండేవి. కానీ 2015లో సీఎస్‌కే, ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో అవి చేతులు మారాయి. జట్టు ఫై నిషేధంపై ‌నిషేధం కూడా విధించారు.  మరోపక్క అమితాబ్ ఫ్యామిలీకి ప్రో కబడ్డీ లీగ్‌లో   జైపూర్ పింక్‌ పాంథర్స్‌ జట్టు‌లో, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లోని చెన్నై ఫుట్‌బాల్‌ క్లబ్‌లో వాటాలున్నాయి.

leave a reply