సారథుల్లో వాళ్ళ తరవాతే కోహ్లీ!

గత కొంతకాలంగా అటు బ్యాటింగ్ లోను, కెప్టెన్ గాను విజయం సాధిస్తున్న టీమిండియా కెప్టెన్ అత్యత్తుమ క్రికెట్‌ కెప్టెన్ల జాబితాలో ఒకరని  ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ తెలిపాడు… అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అంచనా వేయగా ప్రస్తుతం చక్కని ఫామ్ కనబరుస్తున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ కూడా ఉన్నాడన్నారు. అయితే కోహ్లి కేవలం నాయకుడు మాత్రమేనని, కానీ సమర్థుడైన సారథి కాదనే అభిప్రాయాన్నికూడా తెలియచేసాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు కోహ్లినే తగిన సారథిగా వార్న్‌ పేర్కొన్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఆసీస్‌ తాత్కాలిక టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌లను సమర్థులైన కెప్టెన్లని వార్న్‌ అభిప్రాయపడ్డాడు.

మీడియా చేసిన ఒక ఇంటర్వ్యూలో వార్న్‌ మాట్లాడుతూ… నాయకత్వం, సారథ్యం, లీడర్‌ ఆప్‌ ద టీమ్‌ ఈ మూడు అంశాలను వేర్వేరుగా చూడాలన్నాడు. కోహ్లీ కేవలం ఒక జట్టుకు ఒక బెస్ట్‌ సారధగా మాత్రమే పనిచేస్తున్నాడని వివరించాడు. కోహ్లికి తాను కూడా పెద్ద అభిమానినని, అట పరంగా కోహ్లిని అసాధారణ ఆటగాడని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టును కోహ్లి నడిపిస్తున్న తీరు అద్బుతమన్నాడు. కానీ సమర్ధవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్లడంలో కొంచం నిరాశపరుస్తున్నాడన్నాడు. ఒక జట్టుకు సరైన వ్యూహ రచన చేసి నడిపిస్తున్న ప్రస్తుత కెప్టెన్ల జాబితాలో విలియమ్సన్‌, టిమ్‌ పైన్‌లే కోహ్లి కంటే ముందున్నారన్నాడు. కోహ్లి కంటే వారిద్దరే సమర్దవంతమైన సారధులని వార్న్‌ తెలిపాడు.

leave a reply