నష్టపరిహారం తప్పక చెల్లిస్తాం..!

ఏపీలో పెథాయ్‌ తుఫాను కారణంగా జరిగిన పంటనష్టంపై శుక్రవారం నాటికల్లా రైతులు, సర్వే నెంబర్ల వారీగా పూర్తిస్థాయిలో అంచనాలు సిద్ధం చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తుఫాను దెబ్బతో రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 74,432 ఎకరాల్లో సుమారు రూ.243.50 కోట్ల పంటనష్టం వాటిల్లిందన్నారు. తుఫాను రాకను ముందుగానే రైతులను అప్రమత్తం చేసి దాదాపు 95 శాతం పంటకోతలను పూర్తిచేయించామన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రానికి నివేదిక పంపుతామని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. ఎలాగైన నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తగిన నష్టపరిహారం అందజేస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. కాగా.. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ ప్రజలకు మేలు చేయడానికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

leave a reply