నాగ్‌పుర్: మన తెలుగు కుర్రాడు హనుమ విహారి (180 నాటౌట్; 300 బంతుల్లో 19×4, 4×6) పరుగులతో విజృంభించాడు. విదర్భతో ఇరానీకప్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (114) సాధించిన ఈ తెలుగు తేజం రెండో ఇన్నింగ్స్‌నూ భారీ శతకంతో అదరగొట్టాడు. అంతేకాక ఇరానీ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2011లో శిఖర్ ధావన్ తర్వాత ఇరానీ కప్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు సాధించిన ఘనత కూడా అతనిదే. విహారి రికార్డు శతకంతో మెరవడంతో రెస్టాఫ్ ఇండియా తిరుగులేని ఆధిపత్యం సాధించింది.
నాలుగోరోజు 102/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా, హనుమ శతకంతో 374/3 పరుగుల వద్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అతనితో పాటు కెప్టెన్ ఆజింక్య రహానె (87), శ్రేయస్ అయ్యర్ (61 నాటౌట్) చక్కని భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈ స్కోర్ చేయగలిగింది. అన్తరం ఛేదనలో విదర్భ ఆట చివరికి వికెట్ నష్టానికి 37 పరుగులు సాధించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు సాధించగా, విదర్భ 425 పరుగులు చేసింది.