కాంగ్రెస్ బుల్లెట్‌కు పదవి.. మోదీనే టార్గెట్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయాలతో జోరు పెంచుతుంది. ప్రియాంక గాంధీ పార్టీ ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అమేధీ నుంచి 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని వార్తలు వెలువడుతున్న సమయంలో ఆమెను ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ ఇన్ చార్జ్ ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఇది ఆమెకు మొట్టమొదటి పార్టీ పదవి. అంటే ప్రియాంక పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు అవుతున్నారన్నమాట.

ఉత్తరప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంతో పాటు 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్‌ను కూడా ఆమె  పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది. అన్నికంటే ముఖ్యంగా వారణాసి ఈ ప్రాంతంలోకే వస్తుంది. అంటే, ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేేేసే వారణాసి నియోజకవర్గంలో కూడా ఆమె కాంగ్రెస్ క్యాంపెయిన్ ను పర్యవేక్షిస్తారు. అందువల్ల ప్రియాంక గాంధీని మోదీ మీద కాంగ్రెస్ వదలిన తూటాగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇంతవరకు ఆమె కాంగ్రెస్ పార్టీకి అపుడపుడు చట్టపు చూపుగా రాజకీయ పర్యటనలు చేస్తూ వచ్చారు. 2017 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఆమె ఎక్కువగా ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయ పర్యటనలు చేయలేదు.

అయితే, తల్లి సోనియాకు ఆరోగ్యం బాగా లేనందున, ఈసారి అమేధీ నుంచి పోటీ చేయకపోవచ్చని, అపుడు ప్రియాంక పోటీచేస్తారనే చర్చ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే ఆమెను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన పార్టీలో ఉందను కోవాలి. సందేహాలను నివృత్తి చేస్తూ ఆమెను ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించారు.

leave a reply