అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గంటా!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు ఆసక్తిగా మారుతుంది. ఎవరు నెగ్గుబోతున్నారో ప్రజలకే కాదు రాజకీయ నాయకులకి కూడా తెలియక తికమక పడుతున్నారు. సర్వే ల ప్రభావమో సీట్ల విషయం లో విభేదాలో తెలియదు కానీ నిలకడ లేని రాజకీయం కనబరుస్తున్నారు.. ఇవాళ ఈ పార్టీ ఐతే రేపు మారో పార్టీ అనట్టుగా మారిన వైనం. సీనియర్ లీడర్లు సైతం పార్టీల ఫిరాయింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమంచి, అవంతి, దగ్గుబాటి పార్టీ లు మారిన విషయం తెలిసిందే.. ఇదే దిశగా మరి కొందరి పేర్లు కూడా ఈ లిస్ట్లో వినిపిస్తున్నాయి..! వాటిలో గంటా శ్రీనివాసరావు ఒకటి.

వస్తున్న వార్తలకి, పుకార్లకి స్పందిస్తూ ‘తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయ‌న‌ కోరారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ వుదంతాల‌పై క్లారిటీ ఇచ్చారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తారా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని విలేక‌రులు అడగ‌గా.. అది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అసలు ఈసారి పోటీ చేయవద్దని చెప్పినా మానేస్తానన్నారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనన్న గంటా.. బీసీ గర్జన నిర్వహించడానికి జగన్‌ అనర్హుడని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా నియమించని జగన్‌..ఇప్పుడు బీసీల పేరుతో హడావిడి చేయడం హాస్యాస్పదమని అన్నారు.

leave a reply