జాతి వివక్ష వివాదంలో…పాక్ క్రికెటర్!

దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా ఆల్‌రౌండర్‌ పెహ్లూక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. పెహ్లూక్వాయో బ్యాటింగ్‌తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్‌ “హే నల్లోడా ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చొంది” అంటూ వ్యాఖ్యలు చేసాడు. స్టంప్‌ మైక్‌లో అతడు చేసిన వ్యాఖ్యలు రికార్డయ్యాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో వివక్షను అంతం చేసేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన సంగతి తెలిసిందే. అలాంటింది ఓ వ్యక్తిని ఇలా అనడం ఏంటని అందరూ విమర్శిస్తున్నారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సీనియర్ ఆటగాడైన అతడు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. ఎవరినైనా కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని పాక్ క్రికెట్ బోర్డు వివరించింది.

అయితే ఆ మ్యాచ్‌కు పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ వ్యాఖ్యలు విన్న మరో వ్యాఖ్యాత అతడేమన్నాడో వివరిస్తారా అని అడగ్గా.. అతడు ఎలా అనువదించాలో తెలియట్లేదని చెప్పడంతో…  అయితే అతడు కావాలనే అనువదించలేదనట్టు తెలిస్తుంది. ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా అభిమానులలో అసహనం రావడంతో సర్ఫరాజ్ వెంటనే స్పందిస్తూ… ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెడితే తనను క్షమించాలంటూ ట్విటర్‌ ద్వారా తెలియచేసాడు. ప్రత్యేకించి ఒకరిని లక్ష్యంగా చేసుకుని తానిలా మాట్లాడలేదనీ… ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చాడు.

leave a reply