చనిపోతూ.. ఇద్దరినీ కాపాడాడు

తల్లి బిడ్డను కాపాడేక్రమంలో తన తుది శ్వాసను విడిచిన ఆటోడ్రైవర్ వివరాల్లోకి వెళ్తే… కుటుంబ కలహాలతో జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ, తన కుమారుడితో కలిసి శనివారం మీథాపూర్‌ కెనాల్‌లో దూకింది. అయితే అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ ఈ సంఘటనను చూసి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను, ఆమె బిడ్డను కాపాడే ప్రయత్నం చేసాడు కానీ అదే క్రమంలో ఆటో డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…వారిద్దరిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో తన వల్ల కాకపోవడంతో సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు.ఈ క్రమంలో అక్కడి చేరుకున్న ముగ్గురు వ్యక్తులు అతి కష్టం మీద సదరు మహిళను, చిన్నారిని కాపాడగలిగారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ఆటో డ్రైవర్‌ పూర్తిగా మునిగిపోవడంతో అతడిని రక్షించలేకపోయారు. అయితే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్‌ మృతదేహం జాడ దొరకలేదని, అతడి ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ తల్లీకొడుకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

leave a reply