ఈసారి.. రోహిత్ పై!

టీమిండియా ఆసీస్ మధ్య జరుగుతున్న మెల్‌బోర్న్‌ టెస్టులో భరత్ తమ జోరును కొనసాగించింది.  215/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కోహ్లీసేన ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్ళింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ అర్ధ శతకాలతో రాణించగా పుజారా తన శతకంతో  టెస్టు కెరీర్‌లో 17వ  శతకం చేసాడు. అయితే  తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 443/7 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మ్యాచ్‌ను అద్భుతంగా ఆరంభించింది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కోహ్లీ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టీమిండియా బ్యాట్స్ మేన్స్ ఆసీస్ బౌలర్లుకి కాసేపు ముచ్చెమటలు పట్టించారు. కోహ్లీ  స్టార్క్ బౌలింగ్ లో కోహ్లీ పెవిలియన్‌ చేరాడు.  కోహ్లీ-పుజారా వీరిద్దరూ కలిసి  మూడో వికెట్‌ నష్టానికి 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ఈసారి  చక్కని  ఇన్నింగ్స్‌ తో నాటౌట్ గా నిలిచాడు. అటు రొండో రోజు అట ముగిసే సమయానికి ఆసీస్ స్కోర్:8/0.

టీమిండియా ఆసీస్ మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలింది. టీమిండియా జోరు ఏ దశలో నిలువరించలేని ఆసీస్ తమ నోటికి పదును పెట్టింది. కోహ్లీ- పైన్ మధ్య జరిగిన మాటలయుద్ధం  మరవక ముందే తాజాగా   మెల్‌బోర్న్‌ జరుగుతున్న టెస్టులో రోహిత్ బాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు.. రోహిత్ శర్మ ఇపుడుగాని సిక్స్ కొడితే ” ఐ.పి.యల్ లో తన సపోర్ట్ రాజస్థాన్ చేయకుండా ముంబైకి చేస్తానని ” వ్యాఖ్యానించాడు. స్టంప్ మైక్ లో రికార్డు అవ్వడం వలన ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. అటు పుజారా కూడా బాటింగ్ ఆడుతున్న సమయంలో పాట్ కుమ్మింన్స్  బౌన్సర్లు ఆడలేవా అంటూ వ్యాఖ్యలు చేసాడు.

leave a reply