చలికాలంలో ఎలాంటి ఫుడ్‌ తినాలి..?

చలికాలంలో ఫుడ్‌ను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో సూర్యకిరణాలు చాలా తక్కువగా పడతాయి. ఉదయం లేట్‌గా ప్రత్యక్షమై, సాయంత్రం తొందరగా సూర్యుడు మాయం అవుతాడు. ఉష్ణోగ్రతలు తగ్గుపోతాయి.. సో బాడీలో అరుగుదల శాతం చాలా మెల్లగా ఉంటుంది. ఫీవర్స్‌, కోల్డ్‌, దగ్గు ఎక్కువగా వచ్చే సీజన్‌ కూడా ఇదే. ఒక్కోసారి ఈ చలి తీవ్రత వలన ఇంటిలో నుండి బయటకు రాని పరిస్థితి కూడా ఉంటుంది.

మరి చాలికాలంలో ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటే మంచిది..? ఓ సారి కింద లుక్కేసేయండి..

1.వెజిటేబుల్‌ సూప్స్‌, అలాగే ఫ్రూట్‌ జ్యూసులు తీసుకోవాలి. మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి.

2.ఫాస్ట్‌ ఫుడ్‌ల జోలికి వెళ్లకూడదు. రోడ్డు పక్కన ఉండే స్టాల్స్‌లలో స్నాక్‌లు తినకూడదు. ఇలాంటి ఆహారాలు ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి.

3.చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆకలి మందగిస్తుంది. అందుకే ఆయిల్ ఫుడ్‌ని తినొద్దు. ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే దాన్ని ప్రిపేర్ చేసుకోండి.

4.డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంట్లో సూప్‌లలాంటివి తయారుచేసుకోండి. ఇందులో లవంగాలు, వెల్లుల్లిలాంటివి చేర్చండి.

5.ఈ కాలంలో నీటిద్వారా అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కాచి వడబోసిన నీటినే తాగాలి. ఫిల్టర్ చేయడం, ప్యూరిఫయర్‌ల ద్వారా వచ్చిన నీటినే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీటిలోని సూక్ష్మక్రిములు నాశనమవుతాయి.

మామూలుగా ఈ కాలమనే కాదు.. ఏ కాలంలోనైనా వేయించిన, స్పైసీ ఫుడ్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. వీటివల్ల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తినకుండా ఉండాలి. ఒక వేళ తినాలనుకున్నా వాటిని ఇంటిలో ప్రిపేర్‌ చేసుకోవడమో లేదా మంచిగా శుభ్రం చేసిన రెస్టారెంట్‌లలోనే తినాలి.

leave a reply