జ్వాలా వైష్ణవీ దేవి..

అష్టాదశ శక్తి పీఠాల్లో మరొకటి ‌శ్రీ వైష్ణవీ దేవి ఆలయం. వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. ఈ ఆలయం జమ్మూకాశ్మీర్‌ నుంచి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు.

వైష్ణవీ దేవీనే వైష్ణో దేవి అని జమ్మూలో పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. అలాగే.. స్థలపురాణము ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మాణము చేసినారని, త్రికూటపర్వతమునకు పక్కన ఐదు రాతి కట్టడములు ఉన్నాయని, వీటిని పంచ పాండవులకు ప్రతీకగా భక్తులు నమ్మకంగా భావిస్తారు. అలాగే మహాభారతములోని కురుక్షేత్ర ఘట్టము నప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవీదేవి ఆశీస్సులు తీసుకుని రమ్మని చెప్పినట్లుగా చరిత్ర చెప్తుంది.

ఇక్కడ సతీదేవి కుడి భాగము పడిన కారణముగా చాలా శక్తి వంతమైన అమ్మవారుగా కొలుస్తారు. అలాగే.. ఈ దేవిని జ్వాలా వైష్ణవీ దేవీగా కూడా ఇక్కడ ప్రజలు కొలుస్తారు. జ్వాలగా దర్శనమిచ్చే అమ్మవారు ఇదే అని కూడా చెప్తూ ఉంటారు. ఏటా కొన్ని లక్షల మంది ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే.. ఈ ఆలయం సంవత్సరంలోని కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే చాలా ఎత్తైన ప్రాంతం. అందులోనూ చల్లగా మంచు పడే ప్రాంతం కారణంగా.. సంవత్సరంలోని కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. అయితే.. ఈ ఆలయం ఎన్నో లక్షల ఏళ్ల క్రితం నిర్మించబడినదని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయం చరిత్రను రకరకాలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

leave a reply