వైట్‌ రైస్‌ తింటున్నారా.. అంతే..!

ఏది తింటే మంచిది.. ఏది హెల్త్‌కు మంచి చేస్తుంది.. అనే వాటిని తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మనదేశంలో అత్యధికంగా పండే పంట వరి. చాలావరకు తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బియ్యాన్నే ఎక్కువగా తింటూంటారు. ఒప్పుడు ఇండియాలో అధికంగా మూడు పూటలూ అన్నానే తినేవారు. కాని జీవితాల్లో మార్పులు వస్తూంటాయి కదా.. అలానే.. తినే పదార్థాల్లో కూడా మార్పులు వచ్చాయి.

బియ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి.. ఎక్కువగా తినేవి తెల్ల బియ్యం. అయితే.. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అవడం వల్ల.. తినే తెల్ల బియ్యంపై కూడా అవగాహన వచ్చింది. ముఖ్యంగా తెల్ల బియ్యం అంటేనే బాగా పాలిష్‌ చేస్తారని, దానిలో న్యూట్రిషయన్‌ కంటెంట్‌ తక్కువ అని, వీటిని తినడం వల్ల ఎంతో నష్టమని, తెల్ల బియ్యాన్ని తగ్గించడమే మేలు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఇక వీటిలో ఫైబర్‌ తక్కువగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. కాబట్టి తెల్ల బియ్యాన్ని మానేసి దాని ప్లేస్‌లో ఫైబర్‌ కంటెంట్‌ ఉన్న వాటినే తీసుకుంటున్నారు.. కార్బోహైడ్రేట్స్‌ వల్ల మనిషి బరువు పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకూ తెల్ల బియ్యాన్ని తక్కువ మోతాదులేనే తీసుకుంటున్నారు. దీని వల్ల బరువును కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చు. అలాగని మొత్తానికి అన్నాన్ని తినడం మానేయకూడదు. ఒక రోజులో భాగంగా ఏదో ఒక పూట అన్నాన్ని మన డైట్‌లో పెట్టుకోవాలి. అలాగే బ్రౌన్‌ రైస్‌ను కూడా తీసుకోవచ్చు.

చాలా వరకూ సెలెబ్రెటీవ్స్‌, క్రీడాకారులు, బాడీ బిల్డర్లు కూడా అన్నాన్ని చాలా తక్కువగా తింటూ ఉంటామని చెప్తూ ఉంటారు. తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరుగుదలతో పాటు మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి ఏది ఎంత వరకు తీసుకుంటే మంచిది అని ఆలోచించి మీ డైట్‌లో ప్లాన్‌ చేసుకోండి.

leave a reply