శ్రీ వరసిద్ధి వినాయకుడు

సజీవ మూర్తిగా, సత్యప్రమాణాలకు, ఇష్టకామ్యార్థ సిద్ధిగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడు దర్శనమిస్తున్నాడు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కాడు. ఈ స్వామి బావిలో మనకు దర్శనమిస్తూ కనిపిస్తాడు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉండే స్వామి. స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం.

ఈ ఆలయం చిత్తూరు జిల్లా కాణిపాకం ప్రాంతంలో ఉంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు. అలాగే కోరిన వరాలను ప్రసాదిస్తాడు కనుకనే ఈ స్వామి వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది.

చరిత్ర ప్రకారం.. ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. ఒకసారి ఈ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీంతో బావులను కొంచెం లోతుగా తవ్వడం మొదలు పెట్టారు అన్నదమ్ములు. కాసేపటికి గడ్డపారకు రాయి తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ నీరు తగిలి ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.

కాగా.. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరన్నర దూరం వరకూ పారింది. దీంతో కొంత దూరంలో చిన్న కాలువలా ఏర్పడింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

అలాగే.. ఈ ఆలయంలో ఎన్నో రకాల పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రమాణాలు చేస్తూంటారు. మనకు ఇష్టమైన వస్తువు కానీ, పదార్థాలు కానీ ఇక్కడ వదిలేస్తే మళ్లీ జన్మలో ఆ వస్తువు లేదా పదార్థాల జోలికి వెళ్లకూడదు. కాగా.. బావిలో ఉంటాడు కాబట్టి భక్తుల బాధలు కూడా బావిలో పడేస్తాడని భక్తుల విశ్వాసం. ఏటా కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

అలాగే.. ఈ ఆలయంలో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే స్వామి ఉన్న బావిలోని నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉంటాయి. అలాగే స్వామి ఆకారం కూడా పెరుగతూ ఉండటం.

leave a reply