టీమిండియానే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌!

Indian players Sachin Tendulkar smiles after inspecting the wicket at the MCG in Melbourne, 24 December 2007. India are continuing their preparations for the first Test against Australia, which starts 26 December 2007. RESTRICTED TO EDITORIAL USE PUSH TO MOBILE SERVICES OUT AFP PHOTO/William WEST

టీమిండియా ప్రస్తుతం తిరుగులేని ప్రతిభను కనబరుస్తుందని భారత మాజి ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంవత్సరం మేలో జరగబోయే మెగా టోర్నీకి ఇంగ్లండ్‌ వేదిక కాగా… ఈ ప్రపంచకప్ లో టీమిండియానే ఫేవరెట్‌ అని క్రికెట్ దిగ్గజం లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో కఠినమైన జట్టు ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్‌ జట్టేనని అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ఈ సందర్భంలోనే న్యూజిలాండ్‌ గడ్డపై  ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలిచినందుకు టీమిండియాకు అభినందనలు తెలిపాడు. ప‍్రస్తుతం ఏ దేశంలోనైనా, ఏ పిచ్‌పై అయినా టీమిండియా తన సత్తా చాటగలదని తెలిపాడు.

ప్రస్తుతం టీమిండియా జట్టు సభ్యుల ప్రతిభ అద్భుతంగా ఉందని, టీమిండియా వరుస విజయాల రికార్డులను బట్టి నేను చెప్పట్లేదు, ఆటగాళ్ల ప్రతిభను చూస్తే తెలుస్తుందన్నారు. ఈ జట్టు కూర్పు  ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎక్కడైనా సత్తా చాటగలదన్నాడు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనలు చూస్తుంటే త్వరలో ఆరంభం కానున్న ప్రపంచకప్ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ అని సచిన్ వివరించాడు.

leave a reply