చేజారిన మొదటి మ్యాచ్

ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన క్రీజులో నిలదొక్కుకోవడానికి శ్రమించింది. రోహిత్‌ శర్మ(133), ధోని(51) రాణించినా టీమిండియాకు విజయం దక్కలేదు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లకు తుది జట్టులో స్థానం కల్పించిన ఆసీస్.. ఒకే ఒక్క స్పిన్నర్ నాథన్ లియాన్‌తో బరిలోకి దిగింది. వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆడం జంపాను పక్కనపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో షాన్ మార్ష్ 54, ఉస్మాన్ ఖవాజా 59, పీటర్ హాండ్స్కంబ్ 73 పరుగులతో రాణించడంతో ఆసీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో రెండు వికెట్లు తీయగా, జడేజాకి ఒక వికెట్ దక్కింది.

289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే కీలక వికెట్లని కోల్పోయింది. పూర్తి కష్టాలలో పడిన దశలో ధోని, రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 110 బంతులు ఆడిన రోహిత్ 4 సిక్స్ లు, 7 ఫోర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కానీ, దోనీ తర్వాత ఎవరూ సరైన సహకారం రోహిత్‌కు అందించకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 0-1 ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది.

leave a reply