వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకూడదు!

పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత్‌ భారతావని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తుండగా, తాజాగా పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచిన్చది. ఈ నేపథ్యంలోనే  బ్రాబోర్న్‌ స్టేడియంలో పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను సీసీఐ తొలగించింది. అంతేకాకుండా వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో సైతం పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ని కోరినట్లు తెలుస్తుంది.

ఈ దాడిఫై ఇప్పటివరకు  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  స్పందించకపోవడం గమనార్హం. ఈ ఘటనపై  ఇమ్రాన్‌ కనీసం మాట్లాడాల్సి ఉంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ దాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్‌ ప్రధాని. వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు స్పందించడం లేద్జు? అందుకే వరల్డ్‌ కప్‌లో టీమిండియా పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్ లలో టీమిండియా ఆడకూడదని, ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్‌ బఫ్నా తెలిపారు. త్వరలో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా-పాక్‌ల మధ్య జూన్‌ 16 న  మ్యాచ్‌ జరగనుంది.

leave a reply