నాన్నగారి అంచనాల్ని దాటావు

‘ఫోర్బ్స్‌30 అండర్‌ 30’లో విజయ్‌ దేవరకొండ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అతి తక్కువ వయసున్నవారికి ఫోర్బ్స్‌30 అండర్‌ 30లో చోటిస్తారు. అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మ్యూజిక్‌ విభాగంలో విజయ్‌కు 29వ స్థానం దక్కడం విశేషం.

ఈ నేపథ్యంలో విజయ్‌ను ప్రశంసిస్తూ ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘యాక్టింగ్‌లో బాగా రాణిస్తున్నావు. నాన్నగారి అంచనాల్ని నిలబెట్టినందుకు మరోసారి అభినందిస్తున్నా.. ఇది చాలా కష్టమైన పని’ అంటూ విజయ్‌ని ప్రశంసించారు. అందుకు విజయ్‌ దేవరకొండ ‘థ్యాంక్యూ అక్కా’ అంటూ రిప్లై ఇచ్చాడు. విజయ్‌కు సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలుపగా.. వీరందరికీ విజయ్‌ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చాడు.

leave a reply