‘మీటూ’లో నేను లేకపోవడం అదృష్టం

‘మీటూ’ ఈ పదం ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. హాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకూ ‘మీటూ’ ఉద్యమం ఓ ఉధృతంలా నడుస్తోంది. దీని కారణంగా పలువురు ప్రముఖల పేర్లు తెరపైకి వచ్చాయి. పలువురు డైరెక్టర్స్‌, రచయితలు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొందరు ఆరోపించారు. ఈ వివాదం ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా షేక్‌ చేసింది.

అయితే.. ఆ `మీటూ`లో త‌న పేరు వినిపించ‌క‌పోవ‌డం చాలా అదృష్ట‌మ‌ని అంటున్నారు బాలీవుడ్ సీనియ‌ర్ నటుడు శ‌త్రుఘ్న సిన్హా. `మీటూ` ఉద్య‌మం జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో ఈ వ్యాఖ్యలు చేయ‌డానికి నేను సంశ‌యించ‌డం లేదు. ప్ర‌తీ మ‌గాడి ప‌త‌నం వెనుక కూడా క‌చ్చితంగా ఓ మ‌హిళ ఉంటుంది. ఇటీవ‌ల తెర‌పైకి వ‌చ్చిన `మీటూ` ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. అయితే అందులో నా పేరు లేక‌పోవ‌డం అదృష్ట‌మ‌నే చెప్పాలి` అని శ‌త్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.

leave a reply