నోటి దుర్వాసనకు దూరంగా ఎలా ఉండాలి…

ప్రతి రోజు నాలుకను శుభ్ర పరచండి – ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగు క్లీనర్ తో శుభ్రపరచడం మరిచిపోవద్దు.రోజంత తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాలా నాలుకై పై పెరుకు పోయి ఇన్ఫెక్ట్ అయి దుర్వాసన వచ్చే అవకాశాలున్నాయి.అందుచేత నాలుకను శుభ్ర పరచడం తప్పనిసరి.

కాఫీ కి బదులు గ్రీన్ టీ తాగండి – కాఫీ దుర్వాసనకు ఓక మూల కారణం అనేది జగమెరిగిన సత్యం. అయితె ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే మీరు కాఫీ త్రాగటానికి బదులు వీలయితే గ్రీన్ టీ తీసుకొనే విధముగా అలవాట్లను మార్చుకోండి, మరీనా ఆరోగ్యం,శ్వాస యొక్క తేడాలను మీరే గమనిస్తారు.

కొబ్బరి నూనెతో పుక్కులించడం – కొబ్బరి, కొబ్బరి నూనె లతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే. అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటి అన్నది చాల మందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనెను నోట్లోకి తీస్కోని నాలుగైదు సార్లు పుక్కులించడం వలన నోట్లోని హనికారక బాక్టీరియా నిర్ములించబడి, పళ్ళ చిగుల్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినండి – సాఫ్ట్ గా , క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు తినటం వలన పళ్ళ పై, నాలుక పై అంటుకొని బాక్టీరియా ని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది. ఆపిల్ లేదా క్యారట్ లను రోజు తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకు పోయిన మలినాలు క్లీన్ అయ్యి శ్వాశ శుభ్రంగా, తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది.

leave a reply