అల్పాహారం వల్ల బరువు తగ్గరు!

ప్రస్తుత మానవుల జీవన శైలికి బరువు పెరగడం, తగ్గడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే చాలా మంది బరువు ఎక్కువగా ఉండటం పెద్దగా ఇష్టపడరు ఇందుకోసం వ్యాయామం చేస్తుంటారు. కొంత మంది తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. ఆహార నియమాల్లో… ముఖ్యంగా ఉదయం తీసుకొనే అల్పాహారం మానేయడం వలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అని చెబుతారు. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే బరువు తగ్గే ఛాన్స్ ఉందని, ఇప్పటివరకు పలు అధ్యయనాలు చెప్పిన మాట.

కానీ బరువు పెరుగుదలపై, తగ్గుదలఫై బ్రేక్‌ఫాస్ట్‌ పెద్దగా ప్రభావమేమీ చూపదని మెల్‌బోర్న్‌కు చెందిన మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలియచేసారు. వారు జరిపిన అధ్యయనంలో ప్రతిరోజూ అల్పాహారం తీసుకునే వారు, తీసికుండా ఉండే వారి కేలరీలు దాదాపుగా సమానమేనని వారి అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా వారి బరువులో వచ్చే మార్పు కూడా కేవలం 400 గ్రాములు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

leave a reply