అధిక రక్తపోటు ఎలా వస్తుందంటే?

మానవులలో సాధారణంగా ఉండే రక్తపోటును ప్రభావితం చేసే 500 కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు భావిస్తున్నట్లు కాకుండా అధిక రక్తపోటులో డీఎన్‌ఏ పాత్ర చాలా ఉందని కూడా తెలుసుకున్నారు. ఓ వ్యక్తి భవిష్యత్తులో అధిక రక్తపోటు బారినపడడానికి ఉన్న జన్యుపరమైన ముప్పును అంచనా వేయడానికీ ఈ పరిశోధన సహాయపడింది. రక్తపోటుకు జన్యుసంబంధ కారణాలపై ఇదే ప్రపంచంలో అతి పెద్ద పరిశోధన కావడం విశేషం.

ఈ పరిశోధనకు లండన్‌ క్వీన్‌ మేరీ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజీ సారథ్యం వహించాయి. దాదాపు పది లక్షల మంది జన్యు సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యనం చేయగా. అధిక రక్తపోటు ముప్పును ముందుగానే పసిగట్టడంలో, ఔషధాల తయారీలో ఈ పరిశోధన పెద్ద ముందడుగు అని ప్రొఫెసర్‌ మార్క్‌ కాల్‌ఫీల్డ్‌ చెప్పారు. ‘స్ట్రోక్‌’, హృద్రోగాలకు ‘హై బీపీ’యే ప్రధాన కారణమవుతోందని వారు తెలిపారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 లక్షల మంది మరణానికి అధిక రక్తపోటే కారణమని తాజా సర్వేలో తెలిసింది.

leave a reply