పన్ను మీద పన్ను ఉంటే.. వాళ్లకేం ఇబ్బంది..?

కలర్స్‌ స్వాతి ఈ పేరు తెలియని వారుండరు. ఆమె నవ్వుతో.. ఎంతో మంది అబ్బాయిల మదిని దోచేసింది. తెలుగు తదితర భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది కూడా.. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఈ అమ్మడు తాజా ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. అవేంటో చూసెద్దామా..!

“ఈ మధ్య కొత్తగా వచ్చిన డైరెక్టర్స్‌ కూడా అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు. అందువలన వాళ్లతోను కలిసి పనిచేయాలనుకుంటున్నాను అంది. నేను ‘కలర్స్’ చేస్తున్నప్పుడు పన్ను మీద పన్ను ఉండటం గురించి లొకేషన్స్‌లో కొంతమంది మాట్లాడుకుంటుంటే బాధగా అనిపించేది. అంతే కాదు.. ఇక హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు అంత తీసుకుంటుందట.. ఇంత తీసుకుంటుందట.. అనే రూమర్స్ కూడా వచ్చాయి. నిజంగానే అంత రెమ్యునరేషన్‌ తీసుకుంటే బాగుండేది కదా అనిపించేది. నిజంగా చాలా కోపం వచ్చేది.

ఇక.. ఎవరినైనా సరే నేను చాలా ఈజీగా నమ్మేస్తుంటాను. అలా నమ్మేసి ఆ.. తరువాత ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే వున్నాయి. నాలో నాకు నచ్చనిది ఇదే అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తుంటే స్వాతి మళ్లీ నటించే ఛాన్సు ఉందనమాట..!

leave a reply