వీర విధ్వంస రామ..

వినయవిధేయ రాముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు చెర్రీ. ‘రంగస్థలం’ సినిమా లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత మోగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ చేసిన సినిమా `వినయ విధేయ రామ’. చెర్రీ అనగానే ఫుల్‌ జోష్‌, ఎనర్జీ, డాన్స్‌కి కేరాఫ్‌ అడ్రాస్‌గా చెప్పొచ్చు.

బోయపాటి సినిమా అనగానే స్క్రీన్‌ మొత్తం నిండుగా కనిపిస్తుంది. ఫ్యామిలీ కలిసి వెళ్లి సినిమా చూసే విధంగా సినిమాను రూపొందించడంలో బోయపాటిదే పై చేయి అని చెప్పవచ్చు. ఇక రామ్‌ చరణ్‌ కూడా మంచి ‘రంగస్థలం’ సినిమాలో తన నటనతో అందరిని ఆశ్యర్యపరిచాడు. మరి అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే అది సూపర్‌ హిట్‌ అవుతుందని అభిమానుల అంచానాలకు హద్దే ఉండదు.

‘సింహ’, జయ జానకి నాయక’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు అందించిన బోయపాటి మరి ఈ సినిమాను ఎలా డైరెక్ట్‌ చేశారో తెలుసుకోవాలంటే.. కథేంటో తెలుసుకోవాల్సిందే.

కథేంటంటే..

ఐదురుగురు అన్నదమ్ములతో కూడుకున్న కుటుంబం. బంధాలు, అనుబంధాలకు మారుపేరుగా కనిపిస్తుంది. తన అన్నలపై ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా రామ్‌ కాపాడుతుంటాడు. బీహార్‌లో ఎన్నికల అధికారిగా అన్నయ భువన్ కుమార్, రాజ భయ్యా అనే వ్యక్తితో విభేదాలు ఏర్పడుతాయి. అయితే ఆ వ్యక్తి రామ్‌ కుటుంబసభ్యులను టార్గెట్‌ చేస్తాడు. అప్పుడు రామ్‌ రంగంలోకి దిగుతాడు. తన కుటుంబానికి ముప్పు వాటిల్లితే వినయ, విధేయ రామ్‌గా ఎలా విధ్వంసం చేశాడనేది కథ.

ఎవరెలా చేశారంటే..

రంగస్థలం సినిమాతోనే తన నటనలో విజృభించిన రామ్‌. ఈ సినిమాలో అంతకు మించి నటించాడు. ఫ్యామిలీతో వినయంగా కనిపించే రామ్‌, ఫ్యామిలీ జోలికి వస్తే విధ్వంస రాముడిగా విజృంభిస్తాడు. నటన పరంగా చూస్తే మరింత రాటుదేలాడనే చెప్పొచ్చు. హీరోయిన్‌ కియారా అద్వాణీ, రామ్‌ల మధ్య లవ్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యిందనే చెప్పొచ్చు. అలాగే కియారా అద్వాణీ కూడా అందంగా నటించింది. తన కళ్లతోనే హావభావాలు పలింకించే విధంగా చేస్తుంది. అలాగే రామ్‌చరణ్‌ అన్నయ్యలుగా నటించిన ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, మధు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే స్నేహ పాత్ర ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పవచ్చు. అలాగే విలన్స్‌ పాత్రలో కనిపించే వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు. రామ్‌-వివేక్‌లు పోటాపోటీగా నటించారనే చెప్పొచ్చు. అలాగే వాళ్ల మధ్య పోరాట స‌న్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. బాలీవుడ్ నుంచి వివేక్‌ను తీసుకొచ్చినందుకు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్లో విల‌న్‌ డామినేష‌న్ క‌న‌ప‌డ‌టం బోయ‌పాటి స్టైల్‌.

అలాగే.. డీఎస్పీ అందించిన మ్యూజిక్‌ మామూలుగానే సూపర్‌హిట్‌. యాక్షన్‌ సీన్లలో కొన్ని కొన్ని చోట్ల మ్యూజిక్‌ వస్తుంటే.. ఒళ్లు గల్పుడుస్తుంది. ఈ సినిమాలో మాటలు కూడా ఎవరికి దగ్గ వాళ్ల డైలాగ్స్‌ చాలా బాగా రాశారు. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ డైలాగ్స్‌ అదుర్స్‌ అని చెప్పవచ్చు.

డైరెక్షన్‌..

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంలో బోయపాటి ముందుటారు. బోయపాటి సినిమాలో స్క్రీన్‌ అంతా కళకళలాడుతూ నిండుగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా బాగా పండుతాయని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో మాత్రం.. తొలిభాగంపై పూర్తిగా పీక్స్‌లో ఉన్న సినిమా.. సెకండ్‌ ఆఫ్‌ వచ్చేసరికి విలన్‌ డామినేషన్‌, హింసాత్మకంగా తీశాడని చెప్పాలి. ఇక సెకండాఫ్‌లో ఎంట్రీ అయిన తర్వాత కథ, కథనాలపై పట్టు కోల్పోయాడు. సరిదిద్దుకునే ప్రయత్నం చేసే సమయం కూడా లేకపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని బ్యాడ్ సీన్లు తొలిభాగంలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను ముంచేసిందని చెప్పవచ్చు.

చివరగా.. కుటుంబ పరమైన ఎమోషన్స్‌కు, ఊర మాస్ అంశాలను మేళవించిన చిత్రం వినయ విధేయ రామ. ఊహకు అందని విధంగా ఉండే కొన్ని సీన్లు ప్రేక్షకులను నివ్వెరపాటుకు గురిచేస్తాయి. సంక్రాంతి రేసులో మెగా ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించే విధంగానే ఉన్నట్లు అనిపించింది.

leave a reply