పురంధరేశ్వరి.. అస్త్ర సన్యాసం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? అంటే మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో కొనసాగడంపై ఆమె డైలమాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ కూతురుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పురంధేశ్వరి.. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2004, 2009లో గెలిచారు. మన్మోహన్ సింగ్ టైంలో కేంద్రమంత్రిగా ఉన్నారు. ఏపీ విభజన అనంతరం ఆమె బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

2014లో బీజేపీలో చేరిన పురంధేశ్వరి రాజంపేట నుంచి లోకసభకు పోటీ చేశారు. కానీ ఇక్కడి నుంచి ఆమె ఓడిపోయారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు అంటే ఒంటి కాలిపై లేస్తారు ఆమె. కానీ పొత్తు నేపథ్యంలో కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. ఏపీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ, టీడీపీలు దూరమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది. కానీ బీజేపీకి ఏపీలో అంత బలం లేదు. ఇది ఆ పార్టీకి మైనస్. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోక వెళ్తుందనే ప్రచారం కూడా స్థానికంగా సాగుతోందని అంటున్నారు.

జగన్ పార్టీలో చేరే బదులు ఏపీలో టీడీపీని ధీటుగా ఎదుర్కొనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన పురంధేశ్వరి మరో పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేవని మరికొందరు అంటున్నారు. అవసరమైతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెబుతున్నారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దక్షిణాదిన బీజేపీ ప్రభావం అంతగా లేదు. తెలంగాణలో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. దీని ఆధారంగా ఏపీ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏపీలోని అంతగా ప్రభావం లేదు. మరోవైపు ఎన్నికలు ఖరీదుగా మారాయి. ఓడిపోయే బదులు పోటీ చేయకుండా ఉంటే మంచిదని పలువురు ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారట. వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితిలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

అదే సమయంలో పురంధేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ రాజకీయ రంగం ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతను వచ్చే ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రాతినిథ్యం వహించారు. పురంధేశ్వరి తనయుడు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి పోటీపై నిర్ణయాన్ని కొడుక్కే వదిలేసిన పురంధేశ్వరి తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే, తన కొడుకు రంగ ప్రవేశం చేస్తే, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని తమ కొడుకు హితేష్‌కే వారు వదిలేశారని తెలుస్తోంది.

ఒకవేళ హితేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తే, పురంధేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనని అంటున్నారు. మరోవైపు, పర్చూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ప్రస్తుతం రావి రమణ ఉన్నారు. అలాగే గాదె వెంకట రెడ్డి గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆయన వైసీపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. అయితే అతను టీడీపీలో ఉంటానని చెబుతున్నారు. వైసీపీ కూడా పురంధేశ్వరి కొడుకు తమ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, పర్చూరు నుంచి పోటీ చేస్తారని ఎక్కడా చెప్పడం లేదు.

leave a reply