బంధువుల కోసం..బన్నీ

అల్లుఅర్జున్ ఈసారి తన సెలవులను పాలకొల్లులో జరుపుపుకోబోతున్నాడని సమాచారం. అయితే ఎక్కువ శాతం హైదరాబాద్ శివారులో ఉండే మామ ఊరుకి వెళ్లడం బన్నీకి అలవాటు కానీ ఈసారి మాత్రం తన తండ్రి చెందిన ఊరు పాలకొల్లుకు వెళ్లి జరుపోకోవాలని నిర్ణయించుకున్నాడు. బన్నీ తమ పథ బంధువులను కలవాలని దానికోసం తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ తాత – తండ్రిది పాలకొల్లు. కాని బన్నీ ఎప్పుడు కూడా అక్కడ ఉండటం కాని – పెరగడం కాని జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా చేసుకుంటారు ముఖ్యంగా కోనసీమ ప్రజలు బాగా చేసుకుంటారు అదే బాటలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు సమాచారం.

అయితే బన్నీ పుట్టి పెరిగింది అంత చెన్నై – హైదరాబాద్ లలోనే కావడంతో బన్నీకి  ఇవే సొంత ప్రాంతాలుగా ఉన్నాయి. పాలకొల్లు గురించి బన్నీకి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఇంత కాలానికి బన్నీకి సొంత ఊరు గుర్తుకువచ్చింది. అయితే సంక్రాంతికి అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఈ విషయమై చర్చించుకుంటున్నారు.  ఇది ఇలా ఉండగా పాలకొల్లు మెగా అభిమానులు మరియు బంధువులు మాత్రం అల్లు అర్జున్ పాలకొల్లు రాబోతున్నాడంటూ  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

leave a reply