పురుషుల జట్టు బాటలోనే…మహిళల జట్టు!

టీమిండియా పురుషుల జట్టు బాటలోనే మహిళల జట్టు పయనిస్తోంది. నాలుగో వన్డేలో కోహ్లీ సేన క్లీన్‌స్వీప్‌ అవకాశం చేజార్చుకున్నట్లే, మిథాలీ ఆధ్వర్యంలో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైన మహిళల జట్టు ఆఖరి వన్డే ఓటమితో క్లీన్‌స్వీప్‌ అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ మహిళల జట్టు  టీమిండియాపై ఆలవోక విజయం సాధించింది. చివరగా జరిగిన మూడో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్‌ 2-1 తేడాను తగ్గించింది. అయితే ముందు జరిగిన రొండు వన్డేలను భారత జట్టు గెలవడంతో  సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ వన్డేలో టీమిండియా 150 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమవడంతో కివీస్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ సజై బేట్స్‌ (57; 64 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్‌), సారథి సాటర్త్‌వెయిట్‌ (66 నాటౌట్‌; 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌)లు అర్థసెంచరీలు సాధించి కివీస్ విజయంలో కీలకపాత్ర వహించారు. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన స్మృతి మంధనాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు లభించింది.

అంతకముందు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా కివీస్‌ బౌలర్‌ అన్నా పీటర్సన్‌(4/21)తో విజృంభించడంతో 149 పరుగులకే ఆలౌటైంది. ముందుగా  టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ కు బౌలర్లు రాణించడంతో విజయం సాధించారు. తొలి రెండు వన్డేల్లో పరవాలేదనిపించిన  స్మృతి మంధన(1), రోడ్రిగ్స్‌(12), మిథాలీ(9)లు తక్కువ స్కోరుకే పరిమితమవడంతో టీమిండియా విజయావకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్‌ అవుట్ చేసింది. మరోవైపు వికెట్లు పడుతున్నా, దీప్తి శర్మ ఒంటరి పోరాటం చేసింది. ఈ క్రమంలో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న  దీప్తి శర్మ(52) పీటర్సన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది. దీంతో విజయం కివీస్‌ను వరించింది.  కివీస్ బౌలర్లలో పీటర్సన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా , లీ తహుహు మూడు వికెట్లు తీసుకున్నారు.

leave a reply