అన్ని విభాగాల్లో విఫలమయ్యాం..రోహిత్!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలమవడంతో… దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. ఆతిథ్య న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్‌ సేన తడపడింది. దీంతో భారత్‌పై కివీస్ 80 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో టీమిండియా వెనుకబడింది. ఈ మ్యాచ్ లో కివీస్‌ ఓపెనర్‌ సీఫ్రెట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’ లభించింది. బహుమతి ప్రధానోత్సవం అనంతరం టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో  మేము ఏ దశలోనూ కోలుకోలేకపోయామని అన్నాడు, అందుకే ఘోరంగా ఓడిపోయామని చెప్పుకొచ్చాడు.

మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యామని, అటు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాం. అలాగే భారీ లక్ష్య ఛేదనలో వికెట్లు కోల్పోవడం, కనీసం చిన్నపాటి భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోవడం మా ఓటమికి కారణమని చెప్పాడు. అందులో ఈ మ్యాచ్ లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగినా ఓడిపోవడం బాధించింది. న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడింది. లక్ష్యం ఎంత పెద్దదైన గెలవాలి అనకున్నాం, కానీ ఓడిపోయాం అంటూ రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అక్లాండ్‌లో జరగనున్న రెండో టీ20లో మంచి ప్రదర్శణ చేస్తామని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

leave a reply