ప్రపంచకప్‌కు వేదికగా…ఇండియానే!

ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ప్రక్రియ లేకుంటే భారత్‌లో నిర్వహించాలనుకున్న 2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌లను ఇతర దేశాలకు తరలిస్తామని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌, బీసీసీఐని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐసీసీ ఛీఫ్‌ డేవ్‌ రిచర్డ్సన్‌ మాట్లాడుతూ… ఈ మెగా టోర్నీలను భారత్‌లోనే జరపాలని భావిస్తున్నామని అయన పేర్కొన్నారు. అయితే పన్ను మినహాయింపులు ప్రపంచ క్రికెట్‌కు ఎంతో అవసరమని, ఎందుకంటే ఐసీసీకి వచ్చే ప్రతి రూపాయిని తిరిగి అట కోసమే వినియోగిస్తామని, ఉదాహరణకు వెస్టిండీస్‌ వంటి జట్లకు ఆదాయం పెద్దగా ఉండదని  అటువంటి జట్లకు ఐసీసీ సహాయం చేస్తుందని తెలిపింది. టోర్నీ నిర్వహించే  సమయానికి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు వస్తుందనిభావిస్తున్నాము, ఒక వేళా రాకపోతే మెగా టోర్నీలను ఇతర దేశాలకు తరలించే ఆలోచన చేస్తామని రిచర్డ్సన్‌ పేర్కొన్నారు.

2016లో టీ20 ప్రపంచకప్‌కు భారత ప్రభుత్వం పన్నుల రూపంలో దాదాపుగా రూ.161.30 కోట్లను వసూలు చేసినట్లు తెలిపింది. అప్పుడు ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాకే, మిగిలిన మొత్తాన్ని భారత ప్రభుత్వం ఐసీసీకి అందించింది. దీంతో మేము నష్టపోయామని ఈ నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత బీసీసీఐ తీసుకోవాలని ఐసీసీ డిమాండ్‌ చేసింది. ఈనేపథ్యంలోనే తమకు జరిగిన నష్టాన్ని భరించకపోతే.. ఇకమీదట భారత్‌లో జరిగే మెగాటోర్నీలను ఇతర దేశాలకు కేటాయిస్తామని తెలిపింది.

leave a reply