ప్రధాని మోడీకి చెంపదెబ్బ..

‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలోని భాగంగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని రాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లడుతూ.. పోర్టును 2021 నాటికల్లా పూర్తి చేస్తామన్నారు. మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కొందరు నాయకులు రామాయపట్నం పోర్టును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పోర్టు వల్ల ఎంతో మంది రైతుల కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రకాశం జిల్లాకు ప్రఖ్యాత రామాయం పోర్టు నిర్మాణమన్నారు. ప్రకాశంలో అతిపెద్ద పేపర్‌ మిల్లు తీసుకొస్తామని, దీని వల్ల స్థానికంగా నిరుద్యోగుల సమస్యలు తీరుతాయన్నారు. కేంద్రం సహకరించకపోయినా.. ఉన్నదానిలో.. మా డబ్బుతో ఏపీ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఏపీలో ఒక్క ప్లాంట్‌కు గాని, పోర్టు నిర్మాణంకు కేంద్రం రూపాయి కూడా సహకరించలేదున్నారు. టీడీపీ ప్రజల పార్టీ అన్నారు. ఏది చెప్తే అదే చేస్తామన్నారు.

అలాగే.. జగన్‌ పాదయాత్రపై స్పందిస్తూ.. అవినీతి చక్రవర్తి జగన్మోహన్‌ రెడ్డి అని ఆరోపణలు చేశారు. తాను పవిత్ర పాదయాత్ర చేస్తే.. జగన్ విరామ పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. జగన్‌ ఇచ్చిన హామీలన్నీ కల్లబోలి కథలు అని అన్నారు. కోడికత్తి కేసులో చాల బాగా యాక్ట్‌ చేశారన్నారు. టీడీపీ బురద చల్లాలనుకున్నారు.. కానీ వాళ్లపై వాళ్లే చల్లుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్‌ఐఏకు కోడికత్తి కేసును అప్పగించడం వెనుక ఏం రాజకీయాలు జరుగుతున్నాయో నేను గుర్తించగలను అని అన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోడీకి చెంపదెబ్బని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

leave a reply