ఫెడరల్ ఫ్రంట్‌కు సిద్ధం..అఖిలేష్ యాదవ్!

ఇటీవల ఒడిశా, , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్‌పట్నాయక్‌, మమతా బెనర్జీతో భేటీ అయిన కెసిఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్ర కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కెసిఆర్ ను బలపరుస్తున్నట్లుగా మీడియా ముందు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఫెడరల్ ఫ్రంట్‌ చాలా ముఖ్యమని అయన వివరించారు. అంతేకాకుండా త్వరలో హైదరాబాద్ వచ్చి సీఎం కెసిఆర్ ను కలవబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు . మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నో మంచి పనులు చేసిన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకే వేదికపైకి వచ్చేందుకు కలిసిరావాలని వెల్లడించారు.
కేంద్రం మరియు రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని, ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వాగ్దానాలు చాలానే చేసారని. అయితే సామాన్య ప్రజలకు వాళ్లు చేసిందేమీ లేదు. కేంద్రంలోని బీజేపీ పాలనలో వారి నిజస్వరూపం ఏమిటో బయటపడింది అని అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

leave a reply