గురక సమస్యకు ఇంటి చిట్కాలు

గురక సమస్య ప్రతీ ఇంట్లోనూ ఎదురవుతున్న సమస్యనే.. గాఢ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ప‌క్క‌న ప‌డుకున్న వారు ఎవ‌రైనా గుర‌క పెడితే అప్పుడు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గుర‌క పెట్టే వారి ప‌క్క‌న ఎవ‌రైనా ప‌డుకుంటే వారికి ఇక అస్స‌లు నిద్ర ప‌ట్ట‌దు. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత‌మైన నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. అయితే.. దీనికి కొంత మంది డాక్టర్స్‌ను సంప్రదిస్తూ ఉంటారు. మంచిదే.. కాని కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే గుర‌క స‌మ‌స్య నుంచి కొంతవరకూ బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. చదవండి.. ఇక మీరే..

1. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.

2. కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

3. అర టీస్పూన్‌ తేనె, అరటీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

4. రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. దీంతో గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం పైన తెలిపిన చిట్కాలను పాటించి మీ సమస్యను తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

leave a reply