బెజవాడ శ్రీ ‘కనకదుర్గా దేవి’

కనకదుర్గ గుడి ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. భక్తులకు కొంగుబంగారంగా విజయవాడలోని కనదుర్గా దేవి దర్శమిస్తూ ఉంది.

చరిత్ర ప్రకారం.. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారిని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏమనగా.. దసరాశరన్నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే.. ప్రత్యేక పూజలు చేస్తారు. దీపాలాంకరణ, అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు భక్తిశ్రద్దలతో భవానీమాలను ధరించి పెద్ద సంఖ్యలో అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతారు.

leave a reply