హనుమంతుడు లేని రామాలయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లాలో ఉంది. ఇది ప్రాచీనమైన క్షేత్రంగా పురణాల ప్రకారం తెలుస్తుంది. ఆంధ్రా భద్రాచలంగా కూడా కడప ‘ఒంటిమిట్ట’ రామ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. అలాగే ప్రభుత్వం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపడం ఆనవాయితీ. ఈ ఆలయంలో స్వామి ఏకశిల రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే.. ఈ ఆలయం ‘ఒంటిమిట్ట రామాలయం’గా పేరుగాంచింది.

చరిత్ర ప్రకారం.. రామ-లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ భక్తుల నమ్మకం.

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని అక్కడి వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలవగా మూడోసారి.. సమాధానంగా స్వామి ‘ఓయ్‌’ అని పలికినట్టుగా.. దానికి ఇమాంబేగ్‌ ఆశ్యచర్యం వ్యక్తం చేసి, స్వామికి పరమ భక్తుడిగా మారిపోయాడని ఇక్కడ చరిత్రకు సాక్ష్యంగా చెప్పబడుతుంది.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏమనగా.. హునుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటేగా చెప్పబడుతున్నది. ఏకశిలరూపంలో స్వామి భక్తులకు దర్శనమిస్తూంటాడు. అలాగే స్వామివారి కల్యాణం ఆలయ కమిటీ కన్నుల పండుగగా చేస్తారు. కల్యాణ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అలాగే.. ప్రభుత్వం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపడం ఆనవాయితీ.

leave a reply