కేదార్నాథ్‌ ‘కేథారేశ్వరుడు’

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. కేవలం సంవల్సరంలో ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అక్షయ త్రుతీయ నుంచి దీపావళి వరకూ మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

కేదార్నాథ్ పర్వత శ్రేణి మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం, హిందూ మతం పరమ శివుని యొక్క జ్యోతిర్లింగాను ప్రతిష్టించారు. దీనికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. మొత్తం12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది. ఆది శంకరాచార్య 8వ శతాబ్ధంలో ఈ ఆలయంను స్థాపించారు. దీనికి దగ్గరలోనే మందాకిని నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం పాండవులచే నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయంలో శ్రీక్రిష్ణుడు, పాండవుల విగ్రహాలు దర్శనమిస్తూంటాయి.

అలాగే ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమనగా కేదారేశ్వర స్వామి విగ్రహానికి నెయ్యి రాస్తే.. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయని ఒక నమ్మిక. స్వయంగా పార్వతీ దేవికి కూడా పరమశివుడు చెప్పాడని కూడా అంటూంటారు. ఈ ఆలయంలో అమ్మవారు కేదారేశ్వర గౌరీగా దర్శనమిస్తూంటారు.

leave a reply