సిగిరెట్ తాగడం వల్లే…క్రాష్‌ ల్యాండ్‌!

పైలట్‌ చేసిన నిర్వాకానికి 51 మంది ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. దీనికి గల కారణం కాక్‌పిట్‌లో విమానం నడుపుతున్న పైలట్‌ సిగరెట్‌ కాల్చడం వల్ల జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గత ఏడాది మార్చిలో నేపాల్‌లో చోటు చేసుకుంది. తాజాగా దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించారు. కాక్‌పిట్‌లో పైలట్‌ సిగరెట్ తాగడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారుల విచారణలో తేలింది. యూఎస్‌-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన  విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేసే సమయంలో ప్రమాదం జరిగింది విమానంలో మంటలు ఒక్కసారిగా రావడంతో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన విషయాలు తెలియకపోవడంతో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు సాగించారు. విచారణ చేపట్టిన ప్యానెల్‌ కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ను పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌ కాక్‌పిట్‌లో పొగ తాగడంతో ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది. కాక్‌పిట్‌లోని సిబ్బంది, పైలట్ నిర్లక్ష్యం కారణంగా ల్యాండింగ్‌ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడంతో విమానం క్రాష్‌ ల్యాండ్‌ జరిగినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 67మంది విమానంలో ఉన్నట్లు సమాచారం.

leave a reply