శ్రావణమాసంలో పగలు నిద్రించకూడదా..?

శ్రావణ మాసం సకల శుభాలకు.. శుభప్రదం. పూజలు, వ్రతాలు, పెళ్లిల్లు ఇలా అన్నిశుభాలకు శ్రావణమాసం కలిసి వస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం మనం గమనించవచ్చు. పెద్దలు ఏం చెప్పినా.. అది మన భవిష్యత్తుకి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికే.. అలాగే మన సంప్రదాయాలు అంతమించిపోకుండా చూడటానికే..

కాగా.. శ్రావణ మాసంలో పగలు నిద్రించకూడదని.. ఒంటిపూట భోజనం చేయాలనీ.. శాస్త్రం చెబుతోంది.. ఎందుకు..? మీరే చదవండి..

శ్రావణ మాసంలో పూజలు.. నోములు జరుపుకునేవారు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించవలసి ఉంటుంది. శ్రావణమాసం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది. అందువలన ఈ మాసం లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనది.

చాంద్రమానం ప్రకారం శ్రావణం అయిదవ మాసంగా వస్తుంది. ఈ మాసంలో చంద్రుడు.. శ్రవణా నక్షత్రంలో ఉంటాడు కనుక, శ్రావణమాసమనే పేరు వచ్చింది. సాధారణంగా లక్ష్మీనారాయణులను.. పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ వస్తున్నప్పటికీ, ఈ మాసంలో వారి ఆరాధన వలన లభించే ఫలితం మరెన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఇక ఈ మాసంలో ఏ దైవానికి ఇష్టమైన రోజున ఆ దైవాన్ని ఆరాధించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సోమవారం రోజున శివుడికి పూజాభిషేకాలు, మంగళవారం రోజున పార్వతీదేవిని మంగళ గౌరిగా ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు.. సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని.. శనివారం రోజున శ్రీమహా విష్ణువును సేవించడం వలన సకల సంపదలు.. శుభాలు కలుగుతాయి. అందువలన శ్రావణ మాసంలో నియమనిష్టలను పాటిస్తూ లక్ష్మీనారాయణులను.. పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూంటారు.

leave a reply