భారత బౌలర్ల… దూకుడు!

పెర్త్:ఆస్ట్రిలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్లు చెలరేగిపోతున్నారు. టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కి ఓపెనర్స్ శుభారంభాన్ని ఇచ్చారు. మొదట బాటింగ్ కి దిగిన మార్కస్ హారిస్ మరియు ఫించ్  ఆచి తూచి ఆడుతూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు తరువాత బుమ్రా బౌలింగ్లో ఫించ్ (50) ఎల్బీగా వెనుదిరిగాడు.తరువాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు  పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. మరొక ఓపెనర్  మార్కస్ హారిస్(70) హనుమ విహారి బౌలింగ్ లో రహానే కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రిలియా స్కోర్ 277-6. పేసర్లకు ఎక్కువగా అనుకూలించే ఈ బౌన్సీ పిచ్ ఫై భారత బౌలర్లు తమ జోరు  కొనసాగిస్తున్నారు.

 భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఒక్క స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కూడా లేకుండానే బరిలోకి దిగింది. కానీ స్పిన్నర్లు లేని లోటును హనుమ విహారి తీర్చాడని చెప్పొచ్చు . అవసరమైన సమయంలో కీలకమైన వికెట్స్ ను పడగొట్టి ఆసీస్ పతనానికి దారి తీసాడు. ఆసీస్ టీంను ఆదుకుంటాడు అని అనుకున్న హెడ్(58) వికెట్ ను ఇశాంత్ తీసాడు. ప్రస్తుతం క్రీజులో టిమ్‌పైన్‌(16),పాట్ కమ్మిన్స్ (11) ఉన్నారు.

leave a reply