వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో మైదానంలో బంతి, బ్యాట్‌తోనే కాకుండా తన ఆట, పాటలతో అభిమానులను అలరిస్తుంటాడు. వికెట్ తీసినప్పుడైనా.. మ్యాచ్ గెలిచినప్పుడైనా అతను వేసే స్టెప్పులుతో అభిమానులను ఆకట్టుకుంటాడు. అయితే బ్రేవో 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకగా.. ఆయా దేశవాళీ టీ20 లీగ్‌ల్లో మాత్రం ఆడుతానని తెలిపాడు. ఇక 2016 టీ20 ప్రపంచకప్ విజయానంతరం ‘ఛాంపియన్’ సాంగ్‌ను విడుదల చేసి తనో మంచి సింగర్‌నని చాటుకున్నాడు.. ఈ కరేబియన్ క్రికెటర్ మరో ఆల్భమ్‌ను విడుదల చేశాడు.
ఈ సారి ఆసియా క్రికెటర్లను ప్రస్తావిస్తూ అతను పాడిన పాట ఆకట్టుకుంటోంది. ఆసియా క్రికెటర్లు కుమార సంగాక్కర, మహేళ జయవర్ధనే, విరాట్ కోహ్లి, ఎంఎస్‌ధోని, షకీబుల్ హసన్, షాహిదీ అఫ్రీదీ, రషీద్ ఖాన్‌లను ప్రస్తావిస్తూ ‘దిస్ వన్ ఈజ్ ఏషియా’ గా ఈ పాటను రూపొందించాడు. ఈ సాంగ్‌ను పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రీదీ కొనియాడుతూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్‌చల్ చేస్తోంది.