భారీ భూకంపం..సునామి హెచ్చరిక!

ఫిలిప్పీన్స్‌  దక్షిణ ప్రాంతంలో ఉండే  మిందానావో ద్వీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అక్కడి  జనరల్‌ శాంటోస్‌ అనే నగరానికి ఉత్తరాన 193కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు  వచ్చిన్నట్లు పేర్కొంది. భూకంప ధాటికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో  సునామీ వచ్చేదాఖలున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనితో ప్రజలంతా జాగ్రత్తగా ఉండకని పసిఫిక్‌ సునామీ కేంద్రం హెచ్చరించింది. అయితే అమెరికాకు చెందిన హవాయికి సునామీ ప్రమాదమేమీ లేదని స్పష్టంచేసింది.

తీరప్రాంత ప్రజలందరూ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు..ఈమేరకు అక్కడి అధికారులు తీర ప్రాంత  ప్రజలను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. భూకంపం నేపథ్యంలో తీవ్రతను బట్టి ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు పంపించారు. భూకంపం వల్ల కలిగిన నష్టం వివరాలను అధికారులు ఇంకా తెలియచేయలేదు. ఇండోనేషియాలో క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవ్వడంతో భారీ సునామీ వచ్చి  చాల ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన  సంగతి తెలిసిందే.

leave a reply