కేసీఆర్‌ మీకేం.. ఫ్రీ కాదు..

ప్రజావేదికలో భాగంగా అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘విద్యుత్-మౌలిక రంగాల్లో అభివృద్ధి’పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీలో ప్రతీ ఇంటికి ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయం లేకపోయినా రామాయపట్నం పోర్టును సొంతంగా ప్రారంభించామని వెల్లడించారు.

కాగా.. పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని సీఎం తెలిపారు. ఏపీకి వచ్చి పార్టీ పెడతామని నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న సీఎం కేసీఆర్‌ విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఇంకా ఏపీకి రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎద్దేవా చేశారు. కరెంట్ అన్నది ఫ్రీగా రాదని ఫైరయ్యారు. తెలంగాణ ఆ బాకీని తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇందుకు తెలంగాణ ముందుకు రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని బాబు హెచ్చరించారు.

leave a reply