భారీ స్కోరు…దిశగా!

సిడ్నీ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. టీం ఇండియా నయావాల్ మల్లి తన సత్తా చూపించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ప్రారంభంలోనే తొలి వికెట్ కొల్పింది. చతేశ్వర్‌ పుజారా(130 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్‌; 58 బంతుల్లో 5 ఫోర్లు)తో  జట్టును ఆదుకున్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మళ్ళి తన వీలునిన ఆటను ప్రదర్శించాడు. అయితే 77 వ్యక్తిగత పరుగుల వద్ద లయన్ వేసిన బంతికి చిక్కాడు. అనంతరం క్రీజు లోకి వచ్చినా కోహ్లీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించడంతో భారత్‌ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఆటలో మొత్తం పుజారానే కనిపించాడు. అయితే ఒక దశలో స్వల్పంగా గాయపడ్డ తన ప్రదర్శనను మాత్రం ఆపకుండా ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ శతకంతో పుజారా తన టెస్టు కెరీర్‌లో 18వ శతకాన్ని పూర్తి చేశాడు. మరో వైపు  హనుమ విహారి తన చక్కటి ఆటతో పుజారాకు అండగా నిలబడ్డాడు. అయితే వీరిద్దరూ ఇదే జోరును కొనసాగిస్తే
టీమిండియా బారి స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, లయన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

leave a reply