మీ బాడీపై వున్న టాటూ ఏమిటీ?

`అనసూయ’ ఇండస్ట్రీలో ఈ పేరు తెలీని వారుండరు.. తన అందంతో.. మాటలతో కుర్రకారుల మది పోగొట్టింది. ఇటు బుల్లితెరపై యాంకరింగ్‌తో పాటు.. అటు వెండితెరపై రంగమ్మత్తగా కూడా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూత్‌లో ఆమెకున్న క్రేజ్‌ అంతా.. ఇంతా.. కాదు. అలాగే అప్పుడప్పుడు వైరల్‌ అవుతున్న వార్తలకు కూడా ఘాటుగా సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. న్యూయర్‌ సందర్భంగా నిన్న ట్విట్టర్‌లో `అనూ’ తెగ అల్లరి చేసింది. నెటిజన్లు అడుగుతున్న ఒక్కో ప్రశ్న తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చింది. ‘మీ వంటిపై వున్న టాటూ ఏమిటీ?  మీ మొదటి రెమ్యునరేషన్‌ ఎంత? ఎందుకు అను అప్పుడే పెళ్లి చేసుకున్నావు..? నువ్వు చాలా అందంగా ఉంటావు..? ఇలా అభిమానులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

అందుకు అనసూయ స్పందిస్తూ .. ‘నా వంటిపై వున్న టాటూ ‘నిక్కూ’ .. అది మా ఆయన ముద్దు పేరు’. ఇక నేను అందుకున్న తొలి రెమ్యునరేషన్‌ 5,500 అని చెప్పింది. అండ్‌ మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అలానే నా పెళ్లి జరిగింది.. అంటూ.. ఇక నా అందమంటారా..? అది గాడ్‌ గిఫ్ట్‌ అంటూ ఓపిగ్గా చెప్పుకొచ్చింది.  

‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా వస్తోన్న ‘యాత్ర’లో మీ పాత్ర ఏమిటి?’ అనే ప్రశ్నకి మాత్రం అనసూయ సమాధానాన్ని దాచేసింది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పను. ఆ పాత్ర నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని మాత్రం చెప్పగలను” అని అంది. ‘యాత్ర’లో అనసూయ చేసిన పాత్ర ఎలాంటిదనే ఆసక్తి ఆమె అభిమానుల్లో ఇప్పుడు మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

leave a reply