రకరకాల బొమ్మలు.. పువ్వులతో..

ఈ మధ్య ఎక్కడ చూసినా రకరకాల బొమ్మలు, పువ్వులతో చీరలు, టాప్స్‌, అలాగే అబ్బాయిల షర్ట్స్‌ దర్శనమిస్తున్నాయి. ఎవరన్నీ చూసినా ప్రస్తుతం ట్రెండ్‌ ఇదే నడుస్తుంది. చిన్న పిల్లలు ఉన్నట్లు కనిపించే బొమ్మలు, ఫోన్స్‌, అలాగే నెంబర్స్‌, వీణలు, తంబూరాలు, రకరకాల పువ్వులు, చిన్న సైజు, పెద్ద సైజు పువ్వులలో కనిపిస్తున్నాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో రకాలుగా ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఏ షాపుల్లో చూసినా అవే.. ఎవరు వేసుకున్నా అవే. అందంగా.. హుందాగా.. ఆధునికంగా.. ఇలా మగువల మనసు దోచే విధంగా కొత్తగా అందుబాటులోకి వచ్చింది. స్కాండినేవియన్‌ ప్రింట్ల నమూనాతో.. వసంత రుతువులోని అందాల్లా ఆవిష్కరించిన రంగురంగుల టాప్‌లు, కుర్తీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెహంగా మోడల్స్‌లలో కూడా వీటిని డిజైన్‌ చేయించుకుని మరీ ధరిస్తున్నారు. ఆడువారు. అలాగే పెద్ద పెద్ద సెలబ్రెటీస్‌ కూడా వీటినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఇక అబ్బాయిల కోసం కొత్త కొత్త మోడల్స్‌ షర్ట్స్‌ మార్కెట్లోకి వచ్చేసాయి. ఒకప్పుడు ఇలాంటి చొక్కాలు వేసుకుంటే ‘పూలరంగడు’ అంటూ ఎకతాళి చేసేవారు. మేమన్నా ముసలోలమా ఇవి వేసుకోవాలా..? అనేవారు. కాని ఇప్పుడు ఇదే ట్రెండ్‌ నడుస్తుంది కాబట్టి నోరెత్తకుండా అవే చూపించండి అంటూ అడిగి మరీ కొంటున్నారు అబ్బాయిలు. చిన్న చిన్న పువ్వులతో ఉన్న షర్ట్స్‌, చుక్కల చుక్కల డిజైన్‌ ఉన్న షర్ట్‌ ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా సేల్‌ అవుతున్నాయి.

leave a reply