రాజ్‌భవన్‌‌లో పవన్…కొత్త రాజకీయం!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి చాలా సేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు తేనేటి విందు ఇవ్వడం జరిగింది. ఈ విందు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో కెసిఆర్ ఇటీవల ప్రముఖులను కలిసిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో తెరాస మరియు వైసీపీ ఒక్కటైయ్యాని తెదేపా విమర్శించింది. వీరి కలయికను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుబట్టారు. పెదరావూరు సభలో దహేని మాట్లాడుతూ.. తెరాసను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు.

అయితే ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు పవన్‌ కల్యాణ్ కేసీఆర్‌, కేటీఆర్‌తో చాలాసేపు మాట్లాడటం చర్చనీయాంశమైంది. పవన్‌ ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పవన్‌ కల్యాణ్‌‌ వారిద్దరితో ఎం ప్రస్తావించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేటీఆర్‌‌, కేసీఆర్‌తో సుమారు అరగంటకు పైగా పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

leave a reply