రెండు రోజుల్లో రెండు పార్టీలు మారుతున్న నేతలు..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నా కొద్ది రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రెండు పార్టీల మద్య వైరం రోజురోజుకీ పెరిగిపోతుంది. అధినేతలిద్దరూ జెట్ స్పీడ్ తో ప్రచారాలు సభలు నిర్వహిస్తున్నారు. రాజన్న రాష్ట్రం అంటూ ఒకరు అభివృద్దే లక్ష్యం అంటూ మరొకరు. అధినేతలు ఆచ్చి తూచి నిపుణుల సలహాల మేరకు సీట్ల సద్ధుబాటు చేస్తున్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తున్నారు.. నియోజకవారిగా సర్వే లు తీసి ఫిల్టర్ చేసి అభ్యర్థులని ఎంపిక చేస్తున్నారు.. ఈ విషయమై కొందరు నేతలకి టికెట్ దక్కలేదు దాంతో ఆశనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇండిపెండెంట్ గా నిలిచి గట్టి పోటీ ఇద్దామని నిశ్చయించుకుంటుంటే మరి కొందరు ఇంకా పార్టీ లు మారటం పై మక్కువ చూపుతున్నారు.. దీంతో అధినేతలు జనం అంతా తికమక కి గురవ్తున్నారు.

తాజాగా కొందరు టీడీపీ నేతలు వైసీపీ లో చేరాలని నిశ్చయించుకున్నారు.. ఈ నాయకులు కూడా వలసల బాట పట్టారు అని ప్రజలు అనుకుంటున్నారు వారి లో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వంగా గీత తదితరులతో పాటు సరీగ్గా రెండు రోజుల క్రితమే వైసీపీ అధినేత సమక్షం లో వైసీపీ చేరిన విషయం తెలిసిందే.. మరి అక్కడ ఏం జరిగిందో ఎంటో వారు నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు.. అనకాపల్లి నుండి ఎంపీ టికెట్ ఆశించిన కొణతాల రామకృష్ణ వైసీపీ లో చేరడం మనకి తెలిసిందే కానీ జగన్ టికెట్ ఇవ్వడానికి తిరస్కరించారట. దీంతో కొణతాల మళ్ళీ మనసు మార్చుకున్నాడు. మళ్ళీ తిరిగి టీడీపీ లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ అంశమై ఇప్పటికే చంద్రబాబు టో ఆయన భేటీ అయ్యారు. ఇరువురి సంబాషణ బయటకి రానప్పటికీ కొణతాల చేరితే సరైన ప్రాతినిధ్యం ఇస్తామని, ఆయన సేవలను వినియోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక రేపో మాపో కొణతాల టీడీపీ అధినేత సమక్షంలో టీడీపీ లో చేరానున్నారని సమాచారం.

leave a reply