చెప్తే.. అర్థంకావటంలేదా..!

శుక్రవారం ప్రజావేదిక హాల్లో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ భేటీ అయ్యింది. వివిధ అంశాలపై చర్చ చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ చేపట్టారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను నేతలు వివరించారు. దీంతో.. పార్టీ నేతలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల వారీగా మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్‌ఛార్జిలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా  అంటూ నిలదీశారు. ‘‘గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా. తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సభ్యత్వ నమోదుమొదటి 3 స్థానాల్లోపశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణ జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వంనమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వనమోదు విశ్లేషణ చేశారు. నేతలు సరిగా సభ్యత్వ నమోదుకు హాజరుకాకపోవటంపై ముఖ్యమంత్రిచంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసంచేస్తూ కాదని హితవు పలికారు. ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని కూడా కొందరుగమనించడం లేదని, పార్టీ ఇచ్చినకార్యక్రమాలు సీరియస్‌గా తీసుకోలేని వారికి మళ్లీ అన్ని పనులూ జరగాలంటే ఎలా అనిప్రశ్నించారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్ధం చేసుకోవడం లేదని,ఇలాగే ఉంటామంటే ఇకఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. 

అలాగే.. రాబోయే 6 నెలలు తాను కఠినంగానే ఉంటానని స్పష్టంచేశారు.  ఎన్నికలదాకా పార్టీలో ఎమర్జెన్సీ.. ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఈ ఆరు నెలలు ఎవరికిఎటువంటి మినహాయింపులు లేవు. నాతో సహా అందరూ ప్రజల్లోనే నిరంతరం ఉండాలి.అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని వివరించాలి.తెలుగుదేశంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. దీనిని ప్రజల్లోకి బలంగాపంపాలి. మీరంతా ఇక్కడ మంత్రులుగా ఉన్నారంటే అది పార్టీ వల్లే గుర్తుపెట్టుకోండిఅని తెలిపారు.

leave a reply