వారి వివాదం..సస్పెండ్ వరకు!

కాఫీ విత్ కారం టీవీ షోలో మహిళలను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీమ్‌ఇండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం పడేలా ఉంది. దీనిపై బీసీసీఐ పాలకుల కమిటీ ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా, వీరిపై మాత్రం కఠిన చర్యలు మాత్రం తప్పవని బోర్డు వర్గాలు నుండి సమాచారం. సీఓఏ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌ రెండు వన్డేల నిషేధం విధించాలని అంటున్నాడు. అటు కమిటీలోని సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు న్యాయపరమైన విచారన జరపాలని తెలియచేసింది. అయితే దీనికి హార్దిక్‌ వివరణ ఇస్తూ క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. కానీ హార్దిక్ వివరన పట్ల సంతృప్తిగా లేనట్లు చెప్పింది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్‌, రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించాలని సూచించింది. అయితే డయానా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాం.

రాహుల్ మాత్రం ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. వాళ్లిద్దరిపై నిషేధం విధించవచ్చా లేదా అనే అంశంపై డయానా బీసీసీఐ న్యాయ విభాగం సలహా కోరింది. ఆమె తుది నిర్ణయాన్ని చెప్పిన అనంతరం ఈ విషయంపై తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. నాకైతే హార్దిక్‌, రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు మంచిగా అనిపించడంలేదని…వాళ్లు తమ హద్దులు దాటి సంబవించారని’’ అని వినోద్‌ అభిప్రాయపడ్డాడు. దీనిపై బీసీసీఐ గాని నిషేధించాలని భావిస్తే.. పాండ్య, రాహుల్‌ 12 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

leave a reply