విచారణలో అన్నీ బయటకి తీస్తా – చంద్రబాబు

సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎలక్షన్ మిషన్ 2019 లో భాగంగా పార్టీ నాయకులతో నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ లో భాగంగా ఆయన వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించారు.. ఆపై తెలుగు దేశం పార్టీ నేతల జోష్ పెంచేందుకు కొంత సేపు మాట్లాడారు. నేటి కార్యచరణ గురించి ఆయన వారితో చర్చించారు.

ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే హక్కు జగన్ లాంటి క్రిమినల్స్ కి లేదని అన్నారు. వివేకా హత్య గురించి ప్రస్తావిస్తూ.. జగన్ కి తన బాబాయితో ఎప్పటినుండో వైరం ఉందని ఆయనని అనేక సార్లు బెదిరించారని బాబు అన్నారు. గతంలో కూడా జగన్ వివేకాని బెదిరింపులకి గురిచేయడం వలన, వివేకా తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని బాబు ఎద్దేవా చేశారు.

సొంత బాబాయితోనే వైరాలు ఉన్న వ్యక్తి ఇక ప్రజలని ఏం చూసుకుంటాడు అని బాబు ప్రశ్నించాడు. చిన్నాన్న హత్యనే గుండెనొప్పిగా చిత్రీకరించి పక్కదారి పట్టించారని, సిట్ విచారణలో అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. వివేకా హత్యలో దోషులను వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అంటే అరాచకమని, టీడీపీ అంటే అభివృద్ధి అని ఆయన వెల్లడించారు. ఇక ఈసారి జరిగే ఎన్నికలే వారికి సరియైన బుద్ది తెలుపుతాయని ఆయన స్పష్టం చేశారు.

leave a reply